Tuesday, April 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుASIపైకి దూసుకెళ్లిన పోలీసు వాహనం.. చికిత్స పొందుతూ మృతి

ASIపైకి దూసుకెళ్లిన పోలీసు వాహనం.. చికిత్స పొందుతూ మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా మానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఏఎస్‌ఐ గోవింద్ నాయక్‌ను పోలీసు వాహనం ఢీకొట్టడంతో ఆయన మృతి చెందారు. స్టేషన్ ఎదుట నిలబడి ఉన్న సమయంలో హోంగార్డు రామారావు నడుపుతున్న వాహనం నియంత్రణ కోల్పోయి ఆయనపైకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన గోవింద్ నాయక్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటన అనంతరం హోంగార్డు రామారావు పరారయ్యాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -