Thursday, April 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

- Advertisement -

18 వరకు అరైవ్‌-అలైవ్‌ ప్రారంభం
పర్యావరణ పరిరక్షణకే ఈవీ విధానం : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకే ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఇందు కోసం ఈనెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రోడ్‌ సేఫ్టీ కోసం పోలీస్‌, రవాణా శాఖ ఆద్వర్యంలో అరైవ్‌-అలైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈనేపథ్యంలో రవాణా నిబంధనలు, ప్రమాదాలకు కారణాలపై చర్చించామన్నారు. సోమవారం హైదరాబాద్‌ రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం రవాణా శాఖ చర్యలు తీసుకుంటున్నదన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలను కఠినంగా అమలుకు చేయనున్నట్టు చెప్పారు. ఆరు రోజుల్లో అన్ని జిల్లాల్లో శాఖ పరంగా సమీక్షలు చేసుకుంటామన్నారు. ప్రమాదాల నివారణ, ప్రాణ నష్టం లేకుండా చూడటమే కార్యక్రమం లక్ష్యమని వివరించారు. యాక్సిడెంట్‌ అయిన గంట గోల్డెన్‌ అవర్‌లో ఆస్పత్రిలో చేర్పిస్తే ‘రహవీర్‌’ అవార్డ్‌ అందజేస్తామని ప్రకటించారు. చెక్‌ పోస్టులు ఎత్తివేసి సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. అన్నీ స్కూళ్ళలో విద్యార్థులకు రవాణా నిబంధనలు వివరించేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఆర్టీసీలో 30 ఏండ్లపాటు సర్వీసులో ఉండి, ఒక్క యాక్సిడెంట్‌ కూడా చేయని వారికి సన్మానం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రోడ్‌ సేఫ్టీ సమావేశాలు ప్రతీ జిల్లాలో నిర్వహించాలని ఆదేశించారు.
ఆర్టీసీ సమ్మె పై మంత్రి ..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం ప్రత్యేక కమిటీ దగ్గర పెండింగ్‌లో ఉందని మంత్రి అన్నారు. రెండు సమస్యలపై మినహా మిగతా అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సిబ్బందికి సంబధించిన అంశాలు పరిష్కరిస్తామని తెలియజేశారు. ప్రేరేపిత సమ్మెలకు వెళ్ళవద్దని ఆర్టీసీ కార్మికులకు మంత్రి సూచించారు. పెండింగ్‌లో ఉన్న డీఏ, పీఆర్‌సీ, ఇదర సమస్యలను పరిష్కరించే ఆలోచనలో ఉన్నామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌ రాజ్‌, రవాణా శాఖ కమిషనర్‌ ఇలాంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జెటీసీ లు చంద్రశేఖర్‌ గౌడ్‌, రమేష్‌, శివలింగయ్య, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. అనంతరం ట్రాఫిక్‌ మోడల్‌ను మంత్రి, అధికారులు పరిశీలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -