Tuesday, April 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనైజీరియాలో ఘోర విషాదం…100 మందికి పైగా మృతి

నైజీరియాలో ఘోర విషాదం…100 మందికి పైగా మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: నైజీరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈశాన్య ప్రాంతంలోని యోబే రాష్ట్రంలో ఉగ్రవాదుల స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని సైన్యం జరిపిన వైమానిక దాడి మిస్ఫైర్ అయి వారపు సంతపై ఆ బాంబులు పడటంతో 100 మందికి పైగా గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారు. జిలి గ్రామంలో సంత జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం, ఈ దాడిలో కనీసం 100 మందికి పైగా మరణించగా, రాయిటర్స్ నివేదికల ప్రకారం సంఖ్య 200 దాటింది.. మృతుల్లో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

నైజీరియా వైమానిక దళం తమ లక్ష్యం ఉగ్రవాదుల స్థావరం, లాజిస్టిక్స్ కేంద్రాలే నని, “ఖచ్చితమైన దాడి” జరిపినట్లు పేర్కొంది. అయితే, ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ మాజీ ఉపాధ్యక్షుడు అటికు అబుబకర్ ఈ దాడిని ఖండిస్తూ, ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈశాన్య నైజీరియాలో బోకో హరామ్, ఐఎస్ డబ్ల్యూఏపీ వంటి ఉగ్రవాద చర్యలు గ్రూపుల పై సైన్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

2017 నుంచి సైన్యం చేసిన దాడుల్లో జరిగిన పొరపాట్ల కారణంగా వందలాది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు అసోసియేటెడ్ ప్రెస్ అంచనా వేసింది. ఈ తాజా ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -