నవతెలంగాణ – హైదరాబాద్ : ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి పెంచాయి. తాజా వివరాల ప్రకారం.. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను సవరించాయి. పలు నగరాల్లో ధరలు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్లు, ఇతర వాణిజ్య సంస్థలకు అదనపు ఖర్చు తప్పడం లేదు. ఇది సాధారణ వినియోగదారులకు కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన తాజా ధరల ప్రకారం హైదరాబాద్లో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.11 పెరిగి రూ.2,996కు చేరుకుంది. ఢిల్లీలో రూ.9.50 పెరిగి రూ.2,747.50కు చేరగా, ముంబైలో రూ.2,691.50 నుంచి రూ.2,701కు పెరిగింది. చెన్నైలో కూడా ధర రూ.2,906 నుంచి రూ.2,916.50కు పెరిగింది. అయితే గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.
మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


