- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మానవత్వం చూపిన వ్యాపారిపైనే ఓ యాచకుడు కత్తితో దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. రూ.5 భిక్షం వేశాడనే కోపంతో వ్యాపారి శ్రీనివాస్‌పై ఓ యాచకుడు హత్యాయత్నానికి ప్రయత్నించాడు. శ్రీనివాస్ ఇచ్చిన చిల్లర తక్కువగా ఉందని గొడవపడి, కత్తితో దాడికి యత్నించగా.. బాధితుడు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు యాచకుడిని అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -



