- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్ -అమెరికా తదుపరి చర్చల దశ త్వరలో ఉండవచ్చని పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. సోమవారం పార్లమెంట్ భవనం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రతికూల పరిణామాలు చోటుచేసుకోలేదని, దీంతో చర్చలు కొంత మేర ఫలించాయన్న భావన కలిగిందని అన్నారు. కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు నిర్మాణాత్మక దిశలో సాగుతున్నాయని సూచించారు. శనివారం అమెరికా, ఇరాన్ మధ్య 21గంటల పాటు చర్చలు జరిగినప్పటికీ, శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో ఇరు దేశాల ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



