- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం ఆమె మేనకోడలు బ్రిస్టీ ముఖర్జీ ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రాంపూర్‌హాట్ ప్రాంతంలోని కుసుంబా గ్రామంలో ఉన్న తన ఇంటి రెండో అంతస్తులోని ఓ గదిలో బ్రిస్టీ ముఖర్జీ ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం పరీక్ష కోసం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -



