Tuesday, September 1, 2026
E-PAPER
Homeజాతీయంసెప్టెంబర్ 5న నిరసనలు రద్దు: సీజేపీ

సెప్టెంబర్ 5న నిరసనలు రద్దు: సీజేపీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీలో సెప్టెంబర్ 5న తలపెట్టిన నిరసనను రద్దు చేసుకుంది. ఈ మేరకు సీజేపీకి చెందిన సౌరవ్ దాస్ సుప్రీంకోర్టు ముందు హాజరై, నిరసనకారులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవడానికి కేంద్రం తీసుకున్న చర్యల దృష్ట్యా, సెప్టెంబర్ 5న జరగాల్సిన మార్చ్ పిలుపును సీజేపీ ఉపసంహరించుకుంటోందని తెలియజేశారు.

ఢిల్లీ తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో నీట్ పేపర్ లీకేజ్ ను వ్యతిరేక నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. విద్యార్థుల నిరసన తర్వాత సీజేపీ నాయకులకు ఇచ్చిన మూడు హామీలకు కేంద్రం కట్టుబడి ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ గత నెల జూలై 20నజంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. యువత ఆందోళనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -