- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నారాయణపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లికి చెందిన దస్తయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు రవితేజ(17) సోమవారం రాత్రి స్నేహితుడి ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకకు వెళ్లాడు. డీజే సౌండ్కు డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. స్నేహితులు, స్థానికులు వెంటనే కోస్గి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
- Advertisement -



