Wednesday, September 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా అరెస్ట్..

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా అరెస్ట్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారు కొంపల్లిలో భారీగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.19 లక్షల విలువైన 1.9 కిలోల అల్ఫ్రాజోలం డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడు మాజీ ఎక్సైజ్ కానిస్టేబుల్ కావడం గమనార్హం. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి జయభేరి పార్క్ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆ ప్రాంతంలో నిఘా పెట్టి నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి అల్ఫ్రాజోలంతో పాటు రూ.40,000 నగదు, ఒక కారు, ఒక బైక్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు మాజీ ఎక్సైజ్ కానిస్టేబుల్ గొల్ల రమేశ్ సూత్రధారిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడిపై గతంలోనే మూడు ఎన్డీపీఎస్ కేసులు నమోదై ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -