- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా నివారణ కోసం మంగళవారం మధ్యాహ్నం పంపిణీ చేసిన క్లోరోక్విన్ మాత్రలు వాడిన అనంతరం 53 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 46 మంది విద్యార్థులు, ఏడుగురు పెద్దలు ఉన్నారు. మడివి జమున(7) అనే రెండో తరగతి విద్యార్థిని వాంతులు చేసుకోవడంతో ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మొత్తం 71 మందికి మాత్రలు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. బాధితులకు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -


