Wednesday, September 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమర్చిపోలేని గుణపాఠం చెప్తాం.. అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక

మర్చిపోలేని గుణపాఠం చెప్తాం.. అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్‌-అమెరికా యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఈ వారం ప్రారంభం నుంచి ఇరుదేశాలు పరస్పరం బాంబుల దాడులకు దిగుతున్నాయి. రాత్రివేళ ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై అమెరికా దాడులు చేసింది. ఈ క్రమంలో పెళ్లి వేడుక జరుగుతున్న ఓ ఇంటిపై క్షిపణి శకలాలు పడటంతో చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. మరో 50 మంది గాయపడ్డారు. అమెరికా దాడులకు ఇరాన్‌ దీటుగా స్పందించింది. బహ్రెయిన్‌, కువైట్‌, జోర్డాన్‌లోని అమెరికాకు చెందిన స్థారలపై ప్రతీకార దాడులు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్‌ సుప్రీంలీడర్‌ మొజ్తబా ఖమేనీ అమెరికాను తీవ్రంగా హెచ్చరించారు. తమ బలగాలు అమెరికాకు మర్చిపోలేని గుణపాఠం నేర్పుతాయని అన్నారు. ఈ వారంలో దాడులు ప్రారంభమైన తర్వాత ఆయన తొలిసారి స్పందించారు. అమెరికా ఈ దాడులు ఎందుకు చేశామా? అని చింతించేలా చేస్తామని ఐఆర్‌జీసీ ప్రతినిధి హుస్సేన్‌ మొహెబి హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -