- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పాఠశాల పూర్వ విద్యార్థి వెంకటేష్ అభ్యర్థన మేరకు “కెనరా రొబెకో ఫౌండేషన్” ఆధ్వర్యంలో సీఎస్ఆర్ నిధులతో 18.32 లక్షల రూపాయల వ్యయంతో 230 మంది విద్యార్థులకు తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు,ఎంఈఓ జి శారదా,మర్రిగూడ సర్పంచ్ వీరమల్ల శిరీష లోకేష్ గౌడ్ ఆధ్వర్యంలో 229 సైకిళ్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రూపుసింగ్,ఎస్ఐ రాంబాబు, మారం గోపాల్ రెడ్డి,శశిధర్ రావు,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



