- Advertisement -
- ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన విలేఖరి
నవతెలంగాణ-గాంధారి: గాంధారి మండలంలోని తిమ్మాపూర్ గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శిపై బుధవారం ఎంపీడీవో రాజేశ్వరకు ఫిర్యాదు చేశారు. సమయపాలన పాటించడంలేదని, విధుల్లో బాధ్యతరహితం వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వార్తను రాసిన విలేఖరికి ఫోన్ చేసిన సదురు కార్యదర్శి బెదిరింపులకు దిగారని, తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని బాధిత విలేకరి ఎంపీడీవో రాజేశ్వర్ కు ఫిర్యాదు చేశారు. తిమ్మాపూర్ పంచాయతీ కార్యదర్శి పై చర్య తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గాంధారి మండలం చెందిన జర్నలిస్టు పాల్గొన్నారు.
- Advertisement -



