Sunday, September 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకుక్క కాటును నిర్లక్ష్యం.. ప్రాణాలు కోల్పోయిన యువకుడు

కుక్క కాటును నిర్లక్ష్యం.. ప్రాణాలు కోల్పోయిన యువకుడు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పరికిబండ మధిర గ్రామం తుపాకులపల్లిలో సురేశ్ (24) అనే యువకుడు కుక్క కాటును నిర్లక్ష్యం చేయడంతో మృతిచెందాడు. మూడు నెలల క్రితం కుక్క కరిచినప్పటికీ, వైద్యం చేయించుకోకపోవడంతో ఇటీవల లక్షణాలు బయటపడ్డాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స విఫలమవడంతో హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి తరలించగా, సెప్టెంబర్ 05న మధ్యాహ్నం చికిత్స పొందుతూ మరణించాడు. కుక్క కాటును నిర్లక్ష్యం చేయకూడదని, టీకా తప్పనిసరిగా వేసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -