నవతెలంగాణ-హైదరాబాద్: డీలిమిటేషన్ పై తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం తన పోరును తీవ్రం చేసిన విషయం తెలిసిందే. గురువారం ఆ రాష్ట్ర వ్యాప్తంగా డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ నల్లజెండాలను ఎగరవేశారు. అదే విధంగా డీలిమిటేషన్ పత్రులను స్వయంగా సీఎం స్టాలిన్ తగలబెట్టారు. తాజాగా తమిళనాడు తిరువురు ఎన్నికల ప్రచారంలో అమిత్‌షాపై ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమిళనాడుకు ఏ విధంగా సీట్లు పెరుగుతాయో సవవిరంగా పేర్కొన్నాలని సవాల్ విసిరారు. తమిళనాడుకు డీలిమిటేషన్ ప్రకారం లోక్ సభ స్థానాలు 47గా నిర్ణయించారు, కానీ అమిత్ షా మాత్రం 39 నుంచి 59కు పెరుగుతాయని చెప్పారని మండిపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయకుండా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ఎన్నిసార్లు నిధులు గురించి ప్రస్తావించినా..స్పందన లేదని విమర్శించారు. ఈ ఎన్నికలు ఢిల్లీకి, తమిళనాడు మధ్య ప్రధాని పోటీ అని చెప్పారు. ఈనెల 23 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 4న పోలింగ్ ఫలితాలు వెలువడనున్నాయి.
అమిత్‌షాపై ఉదయనిధి స్టాలిన్ ఫైర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



