Monday, September 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచర్చి వద్ద భారీ పేలుడు..10 మంది మృతి

చర్చి వద్ద భారీ పేలుడు..10 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : మెక్సికోలోని టెమాస్కాల్సింగో పట్టణంలో మతపరమైన వేడుకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా సామగ్రి భారీగా పేలడంతో 10 మంది మృతి చెందగా, మరో 64 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీపంలోని గోడ కూడా కూలిపోయింది. ఈ ఘటనపై మెక్సికో అటార్నీ జనరల్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. బాణసంచా నిల్వ, నిర్వహణ, భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యం కారణమా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. క్షతగాత్రుల్లో ఇద్దరు మతగురువురు కూడా ఉన్నారని స్థానిక బిషప్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -