- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని ఐదంతస్తుల భవన్ సత్య నికేతన్ హాస్టల్ కూలిపోయిన విషయం తెలిసిందే. సదురు బిల్డింగ్ యజమాని హరిరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భవనం కూలిపోయిన తర్వాత ఓనర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం 10 బృందాలతో పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో రాజస్థాన్‌లోని భివాడిలో బిల్డింగ్ యజమాని హరిరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరగా, సహాయక చర్యలు కొనసాగుతుండగా 12 మందిని సురక్షితంగా బయటకు తీశారు.
- Advertisement -



