నవతెలంగాణ-హైదరాబాద్: ఆరావళి కొండల నిర్వచనం, సరిహద్దుల నిర్ధారణపై సుప్రీంకోర్టు హైపవర్ కమిటీ(హెచ్‌పీసీ)ని నియమించిన విషయం తెలిసిందే. సదురు ఉన్నత స్థాయి కమిటీ నివేదిక సమర్పణపై గడువు పొడిగించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ మేరకు సోమవారం ఈ ఏడాది నవంబర్ 30 వరకు ధర్మాసనం గడువు ఇచ్చింది. ఫిబ్రవరి 2027 వరకు గడువు పొడిగించాలన్న కమిటీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అవసరమైతే కమిటీ “పగలు రాత్రి” పనిచేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్‌లు జయమల్య బాగ్చీ, వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఇకపై ఎలాంటి పొడిగింపు ఇవ్వబోమని స్పష్టం చేసింది. రాజస్థాన్, గుజరాత్‌లోని గిరిజన వర్గాలతో సహా సంబంధిత వర్గాలన్నింటి వాదనలు వినాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి హెచ్‌పీసీ మరో ఆరు నెలల సమయం కోరింది. ఈ విషయంపై తదుపరి విచారణ డిసెంబర్ 2న జరగనుంది.
ఆరావళి కొండల నిర్వచనం..హైపవర్ కమిటీ గడువు పొడిగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



