Monday, September 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు

ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు

- Advertisement -
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు

నవతెలంగాణ-హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలను ఉద్దేశించి తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, స్పీకర్ స్థానమంటే తనకు అపారమైన గౌరవం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు.పోలీసుల అక్రమాలను ప్రశ్నిస్తే.. దాన్ని స్పీకర్‌ను అవమానించినట్లు చిత్రీకరిస్తూ కాంగ్రెస్ నేతలు శవరాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల డిమాండ్లకు భయపడేది లేదు” అని తేల్చిచెప్పారు. అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల, ప్రజాప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, తన ప్యాంటు లాగి గొంతు నొక్కేందుకు యత్నించిన పోలీసు అధికారులపై మాత్రమే తాను ఆగ్రహం వ్యక్తం చేశానని, తీవ్ర అసహనంతో అన్న మాటలను స్పీకర్‌కు ఆపాదిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -