Saturday, April 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహిట్‌ అండ్‌ రన్‌ కేసు..లొంగిపోయిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు

హిట్‌ అండ్‌ రన్‌ కేసు..లొంగిపోయిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ అమీర్ ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు.2022 మార్చిలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45పై వేగంగా వచ్చిన థార్ జీప్ పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో రెండు నెలల పసికందు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు మహిళలు గాయపడ్డారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రమాదం జరిగిన వెంటనే, కారును తాను నడుపుతున్నానంటూ సయ్యద్ అఫ్నాన్ అనే వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. అయితే, పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు నిజం బయటపడింది. ప్రమాద సమయంలో కారు స్టీరింగ్ వద్ద రాహిల్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న రాహిల్, పోలీసులకు చిక్కకుండా దుబాయ్‌కు పారిపోయాడు. తాజాగా హైకోర్టు ఆదేశాలతో రాహిల్ లొంగిపోవడంతో ఈ కేసు దర్యాప్తు మళ్లీ వేగవంతం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -