Tuesday, September 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోస్ట్ ఆఫీస్ లో వాషింగ్ మిషన్ల పంపిణీ

పోస్ట్ ఆఫీస్ లో వాషింగ్ మిషన్ల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ మద్నూర్ 
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా మంజూరైన 40 మంది లబ్ధిదారులకు మంగళవారం మద్నూర్ పోస్ట్ ఆఫీస్ లో అధికారులు వాషింగ్ మెషీన్ల పంపిణీ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సేవలు సబ్ పోస్ట్‌మాస్టర్, గ్రామీణ డాక్ సేవకులు, సమక్షంలో నిర్వహించబడింది. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన ద్వారా సంప్రదాయ వృత్తులు, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు కళాకారులకు అవసరమైన పరికరాలు, శిక్షణ మరియు ఆర్థిక సహాయం అందిస్తూ వారి జీవనోపాధిని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ కార్యక్రమంలో తుకారం తెప్పవార్, అజయ్ తమ్మేవార్, మాధవరావు, నాగేష్, నరేష్, శివాజీ, యోగేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ, తమ వృత్తి, జీవనోపాధికి ఈ పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -