టిపిటిఎఫ్ జిల్లా కార్యదర్శి సంఘ శ్రీనివాస్
నవతెలంగాణ – నెల్లికుదురు
విద్యారంగంలో సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులను నిరంతరం చైతన్య పరుస్తూ ఉద్యమ కార్యాచరణ రూపకల్పమును టి పి టి ఎఫ్ ముందు ఉంటుందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి సంఘ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని ఎం ఆర్ సి కార్యాలయం లో రాష్ట్ర విద్యా సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. విద్యారంగలో సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులను నిరంతరం చైతన్య పరుస్తూ ఉద్యమ కార్యాచరణ రూపకల్పనలో టిపిటిఎఫ్ ముందు ఉంటుందని తెలిపారు.
అందులో భాగంగా ఈ నెల 30 న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద రాష్ట్ర కమిటీ విద్యా సదస్సు నిర్వహిస్తుందన్నారు. విద్యా సదస్సుకు ప్రధాన వక్తలుగా ప్రొఫెసర్ హరగోపాల్, జాతీయ విద్యా విధానం, సామాజిక న్యాయం అను అంశం పైన, ప్రొఫెసర్ ఖాసిం తెలంగాణలో అసమాన విద్యా- విద్యా రంగ సంక్షోభం అను అంశం పైన, ప్రపంచ రాజకీయాల అంశాలపై కే. శ్రీనివాస్ ప్రసంగించనున్నారని చెప్పారు. ఈ కాక్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ కె. నవీన్ నికోలస్, గౌరవ అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం హాజరుకానున్నారని వెల్లడించారు. అందుచేత ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విద్యా సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యాకయ్య, కొత్త వెంకటేశ్వర్లు, సలీమ్ తదితరులు పాల్గొన్నారు.



