Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళలను కోటిశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

మహిళలను కోటిశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -

నవతెలంగాణ – చిన్నకోడూరు 
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల మహిళ  సమాఖ్య సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళాలకు ఇస్తున్న ప్రతి సంక్షేమ పథకం ప్రతి మహిళకు అందేలా చూడాలన్నారు.

అంతేకాకుండా ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే వడ్ల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగకుండా సరిగా ప్రభుత్వ నిబంధనల మేరకు తూకం వేసి వెంటనే రైస్ మిల్లుకు పంపేల చర్యలు తీసుకుంటూ రైతులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్  ను ఐకేపీ మండల సమైక్య సంఘంసభ్యలు అందరూ కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఏపిఎం శ్రీనివాస్ రెడ్డి, సీసీ లు శ్రీనివాస్ రెడ్డి, రాజయ్య,వైకుంఠం, మండల సమైక్య అధ్యక్షులు,28 గ్రామాల విఓ లీడర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -