- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసిన కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి చెక్కుల మంజూరులో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు కృషి అభినందనీయమని మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామ సర్పంచ్ మాధవరావు అన్నారు. ఆ గ్రామానికి నాలుగు కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరు అయ్యాయి. 1. కావట్వార్ గంగామణి 2. కావట్వార్ వీరమని 3. ముదులే అశ్విని 4. మీసాలే కేరాబాయి. ఈ విధంగా పెండ్లిలు చేసిన నిరుపేద కుటుంబాలకు వెంట వెంటనే కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరు కావడానికి ఎమ్మెల్యే కృషిని సర్పంచ్ అభినందించారు. ముందుగా ఎమ్మెల్యే చేతుల మీదుగా ఒకరికి చెక్కును అందజేయగా మిగిలిన మూడింటిని మండల తాసిల్దార్ ఎండి మ్యూజిక్ చేతులమీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
- Advertisement -



