Friday, May 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ సైబర్ నేరగాళ్లు పట్ల అప్రమత్తంగా ఉండాలి

 సైబర్ నేరగాళ్లు పట్ల అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

 నవతెలంగాణ – ఆర్మూర్  
సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్  సూచించారు. పట్టణంలోని  రాంనగర్ పద్మశాలి సంఘం 5 వ తర్ప సంఘంలో జాతీయ అవార్డు గ్రహీత సామాజిక సేవకులు పట్వారి తులసి కుమార్  ప్రజలకు అవగాహన కొరకు శుక్రవారం ప్రత్యేక పోలీస్ శాఖ వారు నిర్వహిస్తున్న మన ఊరు మన బాధ్యత కార్యక్రమం నిర్వహించినారు.  వారికి సైబర్ నేరగాళ్లు, మత్తు పదార్థాల నివారణ, సిసి కెమెరా లా ఉపయోగం, షి టీమ్ పై వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణ లో కెమెరా లు ఏర్పాటు మరియు సైబర్ నేరగాళ్లు పట్ల అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి ఇబ్బందులు ఉన్న 1930 కి కాల్ చేయాలి అన్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు రక్షణ గా ఉంటుందని, పట్వారీ తులసి సేవలు ఆదర్శం కావాలి అన్నారు .ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఆడేపు ప్రభాకర్, చౌకే లింగం, గణేష్, షి టీమ్ ఇంచార్జీ విఘ్నేష్ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -