Friday, May 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరా మహిళా శక్తి పథకం క్రింద గొర్రెల పంపిణీ

ఇందిరా మహిళా శక్తి పథకం క్రింద గొర్రెల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్:  సదాశివ్ నగర్ మండలం ఉత్తనూర్ గ్రామంలో  మహిళా సంఘాలకు శుక్రవారం ఇందిరా మహిళా శక్తి పథకం క్రింద గొర్రెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప సర్పంచ్ రాజయ్య  మాట్లాడుతూ..ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా గొర్రెలు మేకల పెంపకం యూనిట్లను  మహిళలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ పథకంలో  వెన్నెల మహిళా సంఘం సభ్యురాలు బొంపల్లి లక్ష్మి  గొర్రెలు మేకల పెంపకం కొరకు ఒక్కో యూనిట్ రూపాయలు రెండు లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఏపీఎం  ప్రసాద్  మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందానికి  గొర్రెలు, మేకలు, నాటు కోళ్ల పెంపకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మండల సమైక్య అధ్యక్షురాలు బాలంబాయి మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో మహిళలు ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘ అధ్యక్షురాలు సుజాత, సిసి భూమయ్య, వివో ఏలు ప్రవీణ్, మహేశ్వరి, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -