Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడిలో ఘనంగా పోషణ పక్వాడ్

అంగన్వాడిలో ఘనంగా పోషణ పక్వాడ్

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని మండల కేంద్రంలో అంగన్వాడి సెంటర్ మరియు ఆలేరు సెక్టర్ పరిధిలోని ధారావత్ తండా అంగన్వాడి సెంటర్లో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు సిడిపిఓ కమలాదేవి, సూపర్వైజర్ ఉషారాణి సరితలు తెలిపారు. శనివారం పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలు బాలింతలు కిషోర్ బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా వివిధ అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు, పోషకాహారం టీకాలు ఆస్పత్రి కాన్పులు ముర్రుబాలు విషయాలపై కులం కుశంగా వివరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలేరు సెక్టార్ అంగన్వాడి టీచర్లు ఆయాలు ఆశ వర్కర్లు తల్లులు, కృష్ణ బాలికలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -