నవతెలంగాణ – మిడ్జిల్
జడ్చర్ల నియోజకవర్గంలో వివిధ మండలాలలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని 11 గంటలకు పిఎసిఎస్ ఆధ్వర్యంలో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారూ, 12 గంటలకు మసిగుండ్లపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శివపార్వతుల బ్రహ్మోత్సవాలలో పాల్గొని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
జడ్చర్ల మండలంలోని చిన్న ఆదిరాల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
1:30PM సింగం దొడ్డి గ్రామంలో నూతనంగా వేస్తున్న యు జి డి పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. గుడిగానిపల్లి మాజీ సర్పంచ్ కృష్ణ అన్న కుమార్తె, కుమారుడి వస్త్రాలంకరణ కార్యక్రమంలో మిడ్జిల్ కేంద్రంలోని ఎంవిఎస్ ఫంక్షన్ లో పాల్గొంటారు. సాయంత్రం జడ్చర్ల మండలంలోని కురువపల్లి పలుగుతాండకి ఉస్మానియా మెడికల్ కాలేజ్ విద్యార్థి కాట్రావత్ సురేష్ కుటుంబాన్ని పరామర్శిస్తారు అని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొనాలని తెలిపారు.



