Saturday, April 18, 2026
E-PAPER
Homeకరీంనగర్సుప్రీంకోర్టు తీర్పుతో దళిత క్రైస్తవులకు అన్యాయం

సుప్రీంకోర్టు తీర్పుతో దళిత క్రైస్తవులకు అన్యాయం

- Advertisement -

పాస్టర్స్ జిల్లా అధ్యక్షుడు జీవన్ ఇండియా
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

సుప్రీంకోర్టు తీర్పుతో దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుందని పాస్టర్స్ జిల్లా అధ్యక్షులు జీవన్ ఇండియా పేర్కొన్నారు సిరిసిల్లలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ద్వారా మత స్వేచ్ఛ ఉంటుందని రాజ్యాంగానికి విరుద్ధంగా తీర్పు రావడంతో దళిత క్రైస్తవులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. కులం వేరు మతం వేరు కులం పుట్టుకతో వస్తుందని కానీ మతం నమ్మకానికి సంబంధించిందని మతం ఎప్పుడైనా మారతారని కులం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుందని అన్నారు. చట్ట సవరణ విషయంలో దళిత క్రైస్తవులకు మద్దతుగా మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లకు ధన్యవాదాలు తెలియజేశారు. దళిత క్రైస్తవులు అణచివేతకు గురవుతున్నారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నిర్వీర్యం అవుతుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని కోరారు.

జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి రాజేష్ మాట్లాడుతూ ఐక్యతతో ఉన్న క్రైస్తవులను విడగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని క్రైస్తవులను కులాల వారిగా విభజించి ఐక్యతను విరిచి వేయాలని చూస్తున్నారని అన్నారు. క్రైస్తవ్యంలో అన్ని కులాల వారు ఉన్నారని కానీ దళిత క్రైస్తవులకు మాత్రమే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా విడదీసే కుట్ర జరుగుతుందని అన్నారు. దళిత క్రైస్తవులను భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ తీర్పు వచ్చిందని క్రైస్తవులందరూ ఒక్కతాటిపై ఉండి దళిత క్రైస్తవులకు న్యాయం జరిగే వరకు కలసి పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దళిత క్రైస్తవుల పోరాటానికి దళిత సంఘాలు, ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఐక్యమత్యంతో కలిసి రావాలని దళిత క్రైస్తవులకు న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనుకకు తీసుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని  విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బి ఎలీషా, దేవయ్య, జాయింట్ సెక్రెటరీ నతానియల్, మీడియా కన్వీనర్ కులేరి కిషోర్ కుమార్, ఈసీ మెంబర్లు ప్రసాద్, స్టీరింగ్ కమిటీ సభ్యులు విద్యానందం, పౌల్, పాస్టర్లు ఏసు పాల్, ఐజయ్య, బి క్రీస్తు దాస్, గిద్యోను, జాన్, సంసోన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -