నవతెలంగాణ – ఆర్మూర్
ప్రజలు ఎవ్వరూ కూడా లంచాలు ఇవ్వవద్దని ఎమ్మెల్యే పైడి రాకెష్ రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో మున్సిపల్ చైర్మన్ గోనెల హరి, వైస్ చైర్మన్ కౌన్సిలర్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన అభివృద్ధి పనులు జరగాల్సిన పనులను తెలుసుకున్నారు. సీసీ రోడ్డు, బీటీ రోడ్లు అవసరాలను గుర్తించాలని, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చూడాలని కోరారు. వేసవిలో నీటి ఎద్దడి అనేది ఉండకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలు ఎవ్వరు కూడా లంచాలు ఇవ్వకూడదని, మీడియా మిత్రులు కూడా అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎక్కడైనా అవినీతి జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు, పంచాయతీరాజ్ డిఇ కిషన్ నాయక్, వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
అధికారులకు ప్రజలు లంచాలు ఇవ్వొద్దు: ఎమ్మెల్యే పైడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



