డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన సినిమా ‘రోమాం చకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహించారు. డైరెక్టర్, యాక్టర్ అనుదీప్ కేవీ మాట్లాడుతూ.‘డైరెక్టర్ వేణుగోపాల్ లో ఒక యూనిక్ కామెడీ టైమింగ్ ఉంటుంది. ఈ కథ చెప్పినప్పుడు చాలా ఫన్ ఫీలయ్యా. సినిమాలో కూడా చాలా సీన్స్ లో ఆ యూనిక్ కామెడీ మీకు కనిపిస్తుంటుంది’ అని తెలిపారు. ‘మా మూవీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నేను అంతా కొత్త వాళ్లతోనే వెళ్లాలని డిసైడ్ అయ్యి ఒక కన్విక్షన్ తో ఈ సినిమా చేశా. మా టెక్నీషి యన్స్ ప్రతి క్రాఫ్ట్ ను అందంగా తీర్చిదిద్దారు. ప్రతి నటుడు ఆ క్యారెక్టర్ లోని సోల్ ను తీసుకుని సూపర్బ్ గా పర్ ఫార్మ్ చేశారు. ఈ రోజు థియేటర్స్ లో వస్తున్న అప్లాజ్ అంతా వాళ్లకే చెందాలి’ అని డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ,‘మేము కోరుకున్నట్లే థియేటర్స్ లో ప్రేక్షకులు బాగా నవ్వుకుంటున్నారు’ అని తెలిపారు. ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ, ‘మా సినిమా థియేటర్స్ లో బాగా రన్ అవుతోంది. మేము ఏ పర్పస్ తో ఈ సినిమా చేశామో ఆ పర్పస్ వందశాతం నిజమై, మా బ్యానర్‌లో మరో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది’ అని చెప్పారు.
మరో సూపర్ హిట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



