Wednesday, September 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసరికొత్త అనుభూతినిచ్చే డివోషనల్‌ యాక్ష‍న్‌ థ్రిల్లర్‌

సరికొత్త అనుభూతినిచ్చే డివోషనల్‌ యాక్ష‍న్‌ థ్రిల్లర్‌

- Advertisement -

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్. ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 11న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ మీడియాతో ముచ్చటించారు.
ఈ మధ్యకాలంలో నా నుంచి వస్తున్న చాలా బిగ్ బడ్జెట్ సినిమా ఇది. నిర్మాతలు చాలా పెద్ద స్కేల్ లో తీశారు. హిందీ, తమిళ్‌లో కూడా రిలీజ్ అవుతుంది. నార్త్ నుంచి కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తు న్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా సంతోషంగా ఉంది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు కథ మొత్తం నాకు నచ్చింది. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్‌కి మంచి హై ఇస్తాయి. డైరెక్టర్ సంతోష్‌కి వేదాలు, పురాణాల పట్ల చాలా మంచి అవగాహన ఉంది. తనకి ఇది చాలా రైట్ సబ్జెక్టు. తను అనుకున్న కథని అంతే అద్భుతంగా తీశాడు. ఇందులో నేను యూట్యూబ్ లో మూఢ నమ్మకాలను ఎక్స్‌పోజ్ చేసే క్యారెక్టర్‌లో కనిపిస్తాను. ఇది డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్. అలాగే మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సరికొత్త థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా ఇది.
సిద్దు జొన్నలగడ్డ ఒక సీరియస్ క్యారెక్టర్ చేశాడు. మా ఇద్దరి మధ్య ఒక సీన్ ఉంటుంది. అది సినిమాకే హైలెట్‌. చూసిన వాళ్లందరూ కూడా అది చాలా అద్భుతంగా వచ్చింది అని చెప్పారు. అది సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. ఈ పాత్ర ఒప్పుకున్నందుకు సిద్దుకి థాంక్స్. ఇలాంటి సర్‌ప్రైజ్‌లు ఇందులో చాలా ఉన్నాయి. అవన్నీ ప్రేక్ష‍కు లకు మంచి థ్రిల్‌ ఇస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -