Wednesday, September 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅత్యంత శక్తివంతమైన పాత్రలో..

అత్యంత శక్తివంతమైన పాత్రలో..

- Advertisement -

హీరో ధనుష్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టైటిల్ ఫ‌స్ట్ స్ట్రైక్ వీడియో, ‘అలా కా లూవా’ సాంగ్‌ ఫ్యాన్స్‌, సినీ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని, ఆసక్తిని నింపింది. ఈ క్ర‌మంలో ఈ మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టించిన‌ మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన బ‌ర్త్ డే స్పెష‌ల్ వీడియో గ్లింప్స్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మ‌మ్ముట్టి ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌ బోతున్నారు. ఆయ‌న గురించి ఇంట‌ర్‌పోల్ ఆఫీస‌ర్స్ వెతుకుతుంటే ఆయ‌నేమో త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు క్రికెట్ మ్యాచ్ చూస్తుండ‌టం వంటి సీన్స్‌ను ఈ బ‌ర్త్ డే స్పెష‌ల్ వీడియోలో చూడొచ్చు. అస‌లు మ‌మ్ముట్టి పాత్ర ఎలా ఉండ‌బోతుందోన‌ని ఎదురు చూసిన వారంద‌రికీ ఈ సినిమాలో ఆయ‌న పాత్ర చాలా స్టైలిష్‌గా ఉంటూనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. దీంతో సినిమాపై ఉన్న అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. ధ‌నుష్ పాత్ర‌కు, మ‌మ్ముట్టి పాత్ర‌కు ఎలాంటి కాంపీటీష‌న్ ఉండ‌బోతుంది.. ఈ రెండు పాత్ర‌లు సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎలా అల‌రించ‌బోతున్నాయోన‌నే ఆస‌క్తి పెరిగింది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో ధనుష్, సాయి పల్లవి, శ్రీలీల, మమ్ముట్టి, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. వండ‌ర్ బార్ ఫిల్మ్స్‌, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై శ్రద్ధా అగర్వాల్, ధనుష్, అజ్మత్ జగ్మగ్ నిర్మిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 16న రిలీజ్ అవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -