ఆరోస్థానంలో దీప్తి శర్మ
దుబాయ్ : ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత మహిళా బౌలర్లు ఆధిపత్యం చూపిస్తున్నారు. తెలుగమ్మాయి శ్రీ చరణి 779 రేటింగ్ పాయింట్లతో టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నం.1గా కొనసాగుతుంది. ఆసియా కప్‌లో రాణిస్తున్న దీప్తి శర్మ రెండు స్థానాలు ఎగబాకింది. 709 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. సోఫీ ఎకెల్‌స్టోన్, చార్లీ డీన్ (ఇంగ్లాండ్), మబా (దక్షిణాఫ్రికా), లారెన్ బెల్ (ఇంగ్లాండ్ ) టాప్-5లో చోటు నిలుపుకున్నారు. పేసర్ రేణుక సింగ్ రెండు స్థానాలు కోల్పోయి 20వ ర్యాంక్‌లో నిలిచింది. ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ వరల్డ్ నం.5గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన 743 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. టీమ్ ర్యాంకింగ్స్‌లో బారత్ మూడో స్థానంలో ఉండగా.. ఆస్ర్టేలియా, ఇంగ్లాండ్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
అగ్రస్థానంలోనే శ్రీ చరణి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



