Wednesday, September 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగవర్నర్‌ కు అంతా చెప్పాం: బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్

గవర్నర్‌ కు అంతా చెప్పాం: బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: అసెంబ్లీ ముందు మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు చేసిన దాడి చేసిన తీరును బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌ హరీశ్‌ రావు ఆధ్వర్యంలో ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్‌ శుక్లాకు ఫిర్యాదు చేశారు. రూల్స్ కు విరుద్ధంగా తమ ఎమ్మెల్సీలను ఎలా సస్పెండ్ చేశారో గవర్నర్‌ శుక్లాకు చెప్పామన్నారు కేటీఆర్.

సభ బయట అంశాలపై డీజీపీ, సీపీతో గవర్నర్‌ మాట్లాడతానన్నారని వెల్లడించారు. ఫామ్‌ హౌస్‌కు కాంగ్రెస్‌ గూండాలు ఎలా వెళ్లారో గవర్నర్‌కు చెప్పామన్నారు. రాహుల్‌ గాంధీ తరహాలోనే బ్లాక్‌ టీషర్ట్‌ వేసుకున్నాం. మేం చేసిన తప్పేంటి.. తెలంగాణలో పరిస్థితులను గవర్నర్‌ శుక్లాకు వివరించాం. రాష్ట్రంలో ప్రజలకే కాదు.. ప్రజా ప్రతినిధులకూ అవమానాలే ఎదురవుతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -