Sunday, April 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఊరకుక్కల దాడిలో లేగ దూడ మృతి

ఊరకుక్కల దాడిలో లేగ దూడ మృతి

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల 
ఉప్పునుంతల మండలంలోని కాంసానిపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాడి రైతు బొల్లు సత్యనారాయణకు చెందిన లేగ దూడపై ఊర కుక్కలు దాడి చేయడంతో అది అక్కడికక్కడే మృత్యువాత చెందింది.

గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవలి కాలంలో కూడా ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. బొల్లు బాలయ్యకు చెందిన లేగ దూడలు, చీమర్ల యాదయ్యకు చెందిన మేక పిల్లలను కూడా కుక్కలు చంపినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, అలాగే ఊర కుక్కల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -