- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒక వ్యక్తి తన కవల కుమార్తెల గొంతులు కోసి హత్య చేశాడు. యూపీలోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. కాన్పూర్‌లో నివసిస్తున్న బీహర్‌కు చెందిన శశి రంజన్ మిశ్రా పశ్చిమ బెంగాల్‌కు చెందిన రేష్మను వివాహం చేసుకున్నాడు. వీరికి కవల కుమార్తెలు రిద్ధి, సిద్ధితో పాటు ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున కవల కుమార్తెలను కత్తితో గొంతులు కోసి శశి హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశాడు. భార్యపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.
- Advertisement -



