18లోపు ప్రభుత్వానికి అందజేత
సీపీఎస్ రద్దుపై అధ్యయన కమిటీ ఏర్పాటు
ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి : తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మెన్ లచ్చిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) నివేదికపై ముందడుగు పడిందని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మెన్ వి లచ్చిరెడ్డి చెప్పారు. ఈనెల 18లోపు పీఆర్సీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలంటూ సీఎస్ ఆదేశించారని వివరించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్‌జాజు ఉద్యోగ జేఏసీ నాయకులతో చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సంకల్ప సభ తర్వాత ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిందని అన్నారు. పీఆర్సీ నివేదిక, సీపీఎస్ రద్దు, డీఏల విడుదల, పెండింగ్ బిల్లులు, ఆరోగ్య కార్డులపై సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు. సీపీఎస్ రద్దు ఓపీఎస్ పునరుద్ధరణపై మూడు నెలల్లో అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. డీఏ బకాయిలపై ఈనెల 18న స్పష్టత వస్తుందన్నారు. పెండింగ్ బిల్లులను త్వరగా విడుదల చేయాలని కోరామని చెప్పారు. ఆరోగ్య కార్డులను అందరికీ ఇచ్చి పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదిక, సీపీఎస్ రద్దు, డీఏల విడుదల, పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఆరోగ్య కార్డుల అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్, నాయకులు రాములు, రమేశ్ పాక, దర్శన్ గౌడ్, కుమారస్వామి, ఉపేందర్, బిక్షుమ్ యాదవ్, రాబర్ట్ బ్రూస్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎస్ రద్దుపై అధ్యయన
కమిటీ ఏర్పాటు శోచనీయం : దర్శన్‌గౌడ్
సీపీఎస్ రద్దుపై అధ్యయన కమిటీ ఏర్పాటు చేయాలనుకోవడం శోచనీయమని టీజీసీపీఎస్ ఈయూ రాష్ట్ర అధ్యక్షులు లింగమొల్ల దర్శన్‌గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో 70 శాతం మంది సీపీఎస్ ఉద్యోగుల తరఫున సీపీఎస్ ఉద్యోగ సంఘాలకు కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అధ్యయన కమిటీకి స్పష్టమైన కాలపరిమితి విధించాలని కోరారు.
పీఆర్సీ నివేదికపై ముందడుగు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



