Thursday, September 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపెళ్లైన కొద్దిరోజులకే నవ వరుడు గోదావరిలో గల్లంతు

పెళ్లైన కొద్దిరోజులకే నవ వరుడు గోదావరిలో గల్లంతు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పెళ్లైన కొద్దిరోజులకే ఓ నవ వరుడు గోదావరిలో దూకి గల్లంతైన విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లా మలికిపురం మండలం దిండి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిట్టిబాబు కుమారుడు దేవ వికాస్‌కు ఈ నెల 2న ఘనంగా వివాహం జరిగింది. అయితే బుధవారం వికాస్ దిండి – చించినాడ విశిష్ఠ వారధిపై నుంచి గోదావరిలో దూకి గల్లంతయ్యాడు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ మోహన్‌కుమార్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -