నవతెలంగాణ – హైదరాబాద్: గుజరాత్‌లోని గాంధీనగర్ సమీపంలోని కుడసన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోవడంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఎనిమిది మంది కార్మికులను శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరో 10 నుంచి 15 మంది వరకు శిథిలాల్లో చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు తెలిపారు. సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ మిగతా కార్మికులను రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
కూలిన నిర్మాణంలోని భవనం..శిథిలాల కింద చిక్కుకున్న 15 మంది కార్మికులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



