బాలాత్రిపుర సందరి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు
నవతెలంగాణ-నవాబుపేట
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకమైన ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను వేగంగా పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు బాలాత్రిపుర సుందరి అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల ప్రజల మౌళిక వసతులపై దృష్టి పెట్టాలనీ, ఆ తర్వాతనే పర్యాటక ప్రాజెక్టుల గురించి ఆలోచించాలని హితవు పలికారు. “ఏ సమస్య వచ్చినా అందరితో కొట్లాడతా” అని చెప్పే ఎమ్మెల్యే స్థానిక ప్రజల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్థావించకపోవడం విడ్డూరమన్నారు. ఉదండపూర్ ప్రాజెక్టు నిర్వాసితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. విద్యాసంస్థల నిర్మాణాల ఊసే ఎత్తడం లేదనీ, మహిళా భవన్ నిర్మాణంపై అభ్యంతరాలుంటే, వాటిని పరిష్కరించి తర్వాత పోలేపల్లిలో నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. ప్రస్తుతం జడ్చర్ల నియోజకవర్గం అనేక సమస్యలతో సతమతమవుతోందనీ, వీటిపై ఎమ్మెల్యే తక్షణమే దృష్టి సారించి, పరిష్కరించాలన్నారు. పెండింగ్ పనుల పూర్తికి ప్రభుత్వం నుంచి నిధులు సాధించి, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ పనులపై ఎమ్మెల్యే దృష్టి సారించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



