Monday, April 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరెండో ద‌ఫా చ‌ర్చ‌లపై ఇరాన్ కీల‌క నిర్ణ‌యం

రెండో ద‌ఫా చ‌ర్చ‌లపై ఇరాన్ కీల‌క నిర్ణ‌యం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రెండో ద‌ఫా చ‌ర్చ‌ల వేళ‌ ఇరాన్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ముగింపు కోసం పాకిస్తాన్‎లో జరగనున్న రెండో దఫా చర్చలకు హాజరు కాలేమని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా వైఖరే ఇందుకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది.అమెరికా మితిమీరిన డిమాండ్లు, ఆ దేశ వైఖరిలో నిరంతర మార్పులు, హార్మూజ్ జలసంధిలో తమ ఓడరేవులపై కొనసాగుతున్న అమెరికా నావికా దిగ్బంధనాన్ని కాల్పుల విరమణ ఉల్లంఘనగా పరిగణిస్తూ రెండో దఫా చర్చలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపింది.

2026, ఏప్రిల్ 22వ తేదీ వరకు ఇరాన్-అమెరికా మధ్య తాత్కాలిక కాల్పుల విమరణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. దాదాపు 7 వారాలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‎లో ఏప్రిల్ 10న అమెరికా ఇరాన్ చర్చలు జరిపాయి. కానీ ఎలాంటి ఒప్పందం కుదరకుండానే అసంపూర్తి ఈ చర్చలు ముగిశాయి. దీంతో ఏప్రిల్ 20న మరోసారి భేటీ అయ్యి చర్చలు జరపాలని నిర్ణయించాయి. కానీ అమెరికా తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న ఇరాన్ రెండో దఫా చర్చలకు రాలేమని కరాకండిగా చెప్పేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -