నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామైన కొండారెడ్డిపల్లి రైతులు తమ విద్యుత్ కష్టాలను వెళ్లబోసుకుంటున్న వీడియోను సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పంచుకుంటూ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు.. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన అసలైన మార్పు ఇదేనా?” అని కేటీఆర్ తన పోస్టులో ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలో లభించిన 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ స్థానంలో మళ్లీ పాతకాలపు కరెంటు కోతలు పునరావృతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా వోల్టేజ్, సమయానికి కరెంటు రాకపోవడంతో పొలాలకు నీళ్లు పారక పంటలు ఎండిపోతున్నాయని, విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయని, రైతులు విద్యుత్ కోతలతో విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.



