Friday, September 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ తండ్రి ఆత్మహత్యాయత్నం

కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ తండ్రి ఆత్మహత్యాయత్నం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌ తండ్రి సుబ్రహ్మణ్యం ఆత్మహత్యకు యత్నించారు. శుక్రవారం రాత్రి నిద్రమాత్రలు తీసుకున్న ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన వరంగల్‌లోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, మేడిపల్లికి చెందిన హరికృష్ణపై దాడి చేశారనే ఆరోపణలతో సుమంత్‌తో పాటు మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ఏ-1గా ఉన్న సుమంత్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించడంతో గురువారం జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు హాజరై విచారణ ఎదుర్కొన్నారు. అవసరమైనప్పుడు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -