- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో నమోదైన వివరాల్లో తేడాలపై పలువురు ప్రముఖులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ జాబితాలో రాజమౌళి, మహేష్‌బాబు, నమ్రత, వెంకటేశ్ దగ్గుబాటి, సమంత, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ఉన్నారు. క్రీడారంగం నుంచి మిథాలీ రాజ్, పుల్లెల గోపీచంద్, వ్యాపార రంగం నుంచి దివి మురళీకృష్ణ ప్రసాద్, ఉపాసన కొణిదెలకు కూడా నోటీసులు అందినట్లు అధికారులు తెలిపారు. అందుబాటులో లేని ప్రముఖులు తమ తరఫున మరొకరిని విచారణకు పంపవచ్చని పేర్కొన్నారు.
- Advertisement -



