- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వినాయక చవితి పండుగ, వరుస సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. దీంతో ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లతో పాటు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలోనూ రద్దీ నెలకొంది. ప్రయాణికుల తాకిడికి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు అదనపు సర్వీసులు నడిపేందుకు కసరత్తు చేస్తున్నారు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
- Advertisement -



