Tuesday, April 21, 2026
E-PAPER
Homeజాతీయంబీజేపీ,టీఎంసీల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం

బీజేపీ,టీఎంసీల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం

- Advertisement -

ఆ పార్టీల దౌర్జన్యాలకు చరమగీతం పాడుదాం :
లెఫ్ట్‌ ఫ్రంట్‌ అభ్యర్థులకు మద్దతుగా రోడ్‌షోల్లో సీపీఐ(ఎం) అగ్రనేత బృందాకరత్‌

కోల్‌కతా: బీజేపీ, టీఎంసీల నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి ఓటర్లు సహకరించాలని సీపీఐ(ఎం) అగ్రనాయకురాలు బృందాకరత్‌ పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ అభివృద్ధి మార్గాన్ని సృష్టించడానికి బెంగాల్‌లో ఎర్ర జెండా ఎగురుతోందని ఆమె అన్నారు. 23న జరగనున్న పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల మొదటి దశకు ముందు.. ప్రచారంలో భాగంగా లెఫ్ట్‌ ఫ్రంట్‌ అభ్యర్థులకు మద్దతుగా పలు సమావేశాలు, రోడ్‌షోలు జరిగాయి. మాల్దా జిల్లాలోని రతువా, ఘజోల్‌లలో జరిగిన సమావేశాలలో బృందా కరత్‌ ప్రసంగించారు. నయగ్రామ్‌ నియోజకవర్గంలోని ఝార్‌గ్రామ్‌లో పులిన్‌ బిహారీ బాస్కేకు మద్దతుగా బృందాకరత్‌ ప్రచారం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -