సైకిల్‌పై ప్రచారం
ఖరగ్‌పూర్ : పశ్చిమబెంగాల్‌లోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఖరగ్‌పూర్ సదర్ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) తన అభ్యర్థిగా ఒక పేపర్‌వాలాను నిలిపింది. టీఎంసీ, బీజేపీ అభ్యర్థులు చేస్తున్న ఆర్భాటపు ప్రచార కార్యక్రమాలను సైకిల్‌పై ఇంటింటికీ చేస్తున్న నిరాడంబర ప్రచారంతో ఈ పేపర్‌వాలా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఖరగ్‌పూర్ సదర్ స్థానం నుంచి 60 ఏండ్ల మధుసూదన్ రారును సీపీఐ(ఎం) బరిలోకి నిలిపింది. పార్టీ ‘పేపర్‌వాలా’గా స్థానికంగా పేరుబడిన మధుసూదన్ సీపీఐ(ఎం) ఏరియా కమిటీ కార్యదర్శిగా, అలాగే, సీపీఐ(ఎం) పశ్చిమ మేదినీపూర్ జిల్లా కమిటీ సభ్యుడిగానూ ఉన్నారు. ప్రశాంత స్వభావం, దాదాపు బిడియస్తుడైన మధుసూదన్ పట్టణంలోని వంకర వీధుల గుండా తన సైకిల్‌పై ఇంటింటీకి ప్రచారం చేస్తూ ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తూ సమర్థవంతంగా ప్రచారం చేయడం అందర్నీ ఆకట్టు కుంటుంది. సీపీఐ(ఎం) అభ్యర్థిగా ప్రతీ రోజూ ఐదు గంటల పాటు ప్రచారం కోసం షెడ్యూల్ కేటాయించారు. అలాగే మిగిలిన సమయంలో ఇంటి అవసరాల కోసం స్థానిక మార్కెట్‌కు వెళ్లడం, ఇతర పనులు నిర్వ స్తుంటారు. అవివా హితుడైన రారుకి సొంత ఆస్తి లేదు. రారు తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి నివసిస్తున్నారు. ఆయనకు ప్రయాణ సాధనంగా సైకిల్ మాత్రమే ఉంది.
మోడీది అంతా డ్రామా : మమతా
ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి మోడీ చేస్తున్నదీ అంతా డ్రామ అని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాజాగా పాల్గొన్న మోడీ అకస్మాత్తుగా ‘జల్మురి’ కొనడానికి ఆగడం ఒక నాటకం అని మమతా పేర్కొన్నారు. ‘ఇదంతా నాటకం. ప్రచార సమయంలో ప్రధాని ఆకస్మాత్తుగా, ప్రణాళిక లేకుండా ఆగినప్పుడు అక్కడ కెమెరా ఎలా ఉంది. ఈ తతంగమంతా ముందే రాసిపెట్టింది. పైగా మోడీ తన జేబులో రూ. 10 నోటుతో కనిపించారు. ఇది నమ్మశక్యమేనా’ అని మమతా ప్రశ్నించారు. మోడీ తన ప్రచార పర్యటనలో భాగంగా ఝార్‌గ్రామ్‌లో అకస్మాత్తుగా ఆగి, మర మరాలు, పచ్చిమిర్చి, ఇతర మసాలాలతో తయారుచేసే ఒక ప్రసిద్ధ బెంగాలీ వీధి ఆహారమైన ‘జల్మురి’ని కొనుగోలు చేసిన ఒక రోజు తర్వాత మమతా ఈ వ్యాఖ్యలు చేశారు. బీర్భూమ్ జిల్లాలోని మురాతై అసెంబ్లీ నియోజక ఓవర్గంలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ మమతా ఈ విమర్శలు చేశారు.
ఖరగ్‌పూర్ సీపీఐ(ఎం) అభ్యర్థి ‘పేపర్ వాలా’
- Advertisement -
- Advertisement -



