Tuesday, April 21, 2026
E-PAPER
Homeజాతీయంస్టాలిన్‌ను కలిసిన కేజ్రీవాల్‌

స్టాలిన్‌ను కలిసిన కేజ్రీవాల్‌

- Advertisement -

చెన్నై : ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ ను కలిశారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ చేపట్టిన విద్య, ఆరోగ్యసంరక్షణ, మహిళల సాధికారతకు సంబంధించి కీలక రంగాల్లో ప్రభుత్వం చేస్తున్న కషిని కేజ్రీవాల్‌ స్టాలిన్‌ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌ లో పోస్టు చేశారు. ‘తమిళనాడు ముఖ్యమంత్రి తిరు ఎం.కె స్టాలిన్‌ ను కలవడం గౌరవంగా ఉంది. విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత విషయాలలో మా ఇద్దరికీ ఒకే విధమైన దక్పథం ఉంది. మేము ఎల్లప్పుడూ ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటూనే ఉన్నాము. తమిళనాడు ప్రజల జీవితాలను మార్చడంలో ఆయన అంకితభావంతో చేస్తున్న పాలనను నేను ఎంతగానో అభినందిస్తున్నాను- అని కేజ్రీవాల్‌ పోస్ట్‌ లో పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తమిళనాడు సీఎం, డీఎంకే అభ్యర్థి ఎం.కె. స్టాలిన్‌తో ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ పాల్గోన్నారు. డీఎంకే ఇచ్చిన హామీలను ప్రస్తావించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -